ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఆసక్తి కరంగానే ఉంటాయి.. విపక్షాలు, అధికారపార్టీ లమధ్య ఎప్పుడు ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే జగన్ అధికారంలో కి వచ్చిన తరవాత రాష్ట్రంలో వివాదాల సంఖ్యా ఎక్కువైందని చెప్పొచ్చు.. వచ్చి రాగానే అవినీతి పరులైన టీడీపీ నేతలను జైలుకి పంపి వివాదాలకు ఆజ్యం పోశారు.. ఆ తర్వాత మూడు రాజధానుల వివాదం, ఆ తరువాత కోర్టుల వ్యవహారం, ఇప్పుడు పోలవరం విషయం ఇలా ఒకదానికి తరువాత ఒకటి వచ్చి ప్రజలను ఊపిరి తీసుకోనివ్వకుండా చేస్తున్నాయి ఈ వివాదాలు. ఈ దెబ్బ తో ఏపీ లో పేరు కూడా దేశంలో మార్మోగిపోతోంది..