తెలంగాణాలో గ్రేటర్ ఎన్నికల జోరు రోజు రోజు కి ఉధృతమవుతోంది. అన్ని పార్టీ లు ఇక్కడ విజయ కేతనం ఎగురవేయాలని చూస్తుంది. టీ ఆర్ ఎస్ పార్టీ ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేసింది.. ఇంకా ప్రచారమే మిగిలింది. దుబ్బాక లో పోయిన పరువును ఇక్కడ గెలిచి నిలబెట్టుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగాచారంగా తయారైంది.. ఇక్కడ పోటీ చేసి టైం చేసే బదులు ఆగిపోతే బెటర్ అని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ గెలుపు పై కాంగ్రెస్ కి ఇంకా ధీమా పోలేదు. ఇక బీజేపీ దుబ్బాక లో గెలిచినా ఉత్సాహంతో ఇక్కడ బరిలో దిగి గెలుపును కొనసాగించాలనుకుంటుంది. అయితే ఈ మూడు పార్టీలతో పాటు టీడీపీ కూడా ఇక్కడ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది.. దాదాపు 90 స్థానాల్లో టీడీపీ పోటీచేస్తుందని టీడీపీ చెప్తుంది.. ఇక జనసేన, వైసీపీ ఈ పోటీ లో ఉండట్లేవని క్లారిటీ వచ్చేసింది..