తెలంగాణాలో లాగే ఏపీ లో కూడా బీజేపీ బలపడాలని చూస్తుంది.. తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించి తమ సత్తా చాటాలని భావిస్తుంది. దానికి తగ్గట్లే బీజేపీ పార్టీ కి అన్ని అంశాలు అనుకులిస్తున్నాయి.. ప్రజల్లోకి కూడా బాగానే దూసుకువెళ్తుంది.. కేంద్రంలోని బీజేపీ పార్టీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి రావాలని సోము వీర్రాజు ని లైన్ లోకి దించింది.మొదట్లో కాస్త కాం గా ఉంటూ పెద్దగా ప్రజల నోట్లో నానని సోము ఆ తర్వాత తన చర్యలతో, కార్యచరణలతో పార్టీ ని కొద్ది కాలంలోనే బలోపేతం చేశారు.. దానికి ప్రజలు సైతం ఎంతో ఆశ్చర్య పోయారు.. RSS విధానాలను ఎక్కువగా పాటించే సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దేవాలయాల దాడుల విషయంలో చేసిన హడావుడి అంతా ఇంతాకాదు..