నారా లోకేష్ ఈమధ్య చాల హడావుడి చేస్తున్నాడు. కరోనా సమయంలో పెద్దగా కనిపించకపోయినా ఇప్పుడు ప్రజల్లోకి బాగానే దూసుకువెళ్లిపోతున్నాడు. టీడీపీ భవిష్యత్ లీడర్ గా ఎదిగేందుకు లోకేష్ చాల కష్టపడుతున్నారు కానీ ప్రజలు ఎలాంటి తీర్పు చెప్తారో.. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే లోకేష్ టీడీపీ అధికారంలో ఉన్నపటికంటే ఇప్పడే ఎక్కవుగా పాపులారిటీ పెంచుకుంటున్నాడు.గడచిన పది నెలల లోకేష్ వేరు. మూడు నెలల లోకేష్ వేరు అని అంటున్నారు. గత ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమితో పాటు నేతల నైరాశ్యం కూడా లోకేష్ ను ఆలోచనలో పడేశాయి అందుకే కొంత టైం తీసుకుని లోకేష్ ప్రజలోకి వెళుతున్నారట.. నిజానికి అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షాలో ఉన్నప్పుడే ఓ నాయకుడి సత్తా తెలుస్తుంది..