తెలంగాణాలో ఎన్నికల హడావుడి జోరుగా ఉందని చెప్పొచ్చు.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో భాగ్య నగరంలో అన్ని పార్టీ లు ప్రచారాల హోరు కొనసాగిస్తోంది.. అధికార పార్టీ టీ ఆర్ ఎస్ కి ఈ గెలుపు ముఖ్యం కాగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుండి.. ఇక బీజేపీ దుబ్బాక లో విజయంతో కొత్త ఉత్సాహం తో బరిలోకి దిగుతుంది.. తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసింది.. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ ఇచ్చింది.