వైస్ జగన్ సీఎం అవడానికి పదేళ్లు కష్టపడ్డారని చెప్పొచ్చు..అయితే జగన్ ఇంత స్థాయి కి రావడానికి అయన ఒక్కరి కృషి ఉందంటే ఎవరు ఒప్పుకోరు.. ఎందుకంటే అయన గెలవడానికి ముఖ్య కారణం ప్రజలు అయితే ప్రధాన కారణం అయన వెన్నంటి ఉన్న కొంతమంది నేతలు, కార్యకర్తలు.. వీరు ఎలాంటి స్వార్ధం లేకుండా జగన్ కోసం, పార్టీ కోసం పనిచేసిన వారే..ఇక ప్రజలు అనుకున్నట్లుగానే జగన్ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారు. హామీలు నెరవేర్చడంలో, పథకాల అమలులో ఎంతో పారదర్శకత్వ చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వాటిని భగ్నం చేసి మరీ అధికారంలోకి వచ్చారు. ఎలాంటి రాజకీయ బలం లేని వేళా ఒంటరిగా ప్రజల అండతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి దూసుకుపోయారు..