టీడీపీ లో ఫైర్ బ్రాండ్ ల నేతలకు కొదువ లేదు.. చంద్రబాబు హయాంలో చంద్రబాబు పై ఈగ కూడ వాలనిచ్చేవారు కాదు ఈ ఫైర్ బ్రాండ్ లు.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వెలగపూడి రామకృష్ణ, పంచుమర్తి అనురాధ, సబ్బం హరి, గంటా శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.., బోడే ప్రసాద్, కేశినేని నాని, బీటెక్ రవి, బుద్దా వెంకన్న ఇలా చాలామంది టీడీపీ కి గట్టి లీడర్లు గా ఉండేవారు.. టీడీపీ తరపున అప్పటి ప్రతిపక్షాలను కోలుకోనివ్వకుండా చేశారు.. టీడీపీ తో పెట్టుకోవాలంటే వీళ్ళను చూసి సగం భయపడేవాళ్లు ప్రతిపక్ష నేతలు.. అలాంటిది ఈ నేతల నోళ్లు గత కొన్ని నెలలుగా మూగబోయాయి..