బీజేపీ పార్టీ ఏపీ లో రోజు రోజు కి కొంత బలపడుతున్న సంగతి తెలిసిందే..రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం.. ఆదిశగా కావాల్సిన కార్యాచరణను తనదైన శైలిలో అమలు చేస్తోంది. సోము వీర్రాజు అధ్యక్ష్య పదవి చేపట్టాక ప్రజల్లోకి బీజేపీ పార్టీ వేగంగా దూసుకెళ్లింది.. అధికారంలో ఉన్న పార్టీ మాదిరి సోము ఏపీ లో బీజేపీ బలోపేతానికి చాలా చర్యలు చేపట్టి అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న నాయకులను బీజేపీ సారథులుగా నియమించింది.