తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలకోసం అన్నిపార్టీ లు సిద్ధమవుతున్నాయి.. ప్రచారాల జోరును హోరెత్తిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ ఎన్నికలను ముందే పెట్టి ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పొచ్చు.. అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం రాష్ట్రానికే కాదు దేశానికే పెద్ద షాక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుంచి ఇక్కడ టీ ఆర్ ఎస్ కు ఎదురులేదు.. అందుకే గత రెండు ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తుంది. కేసీఆర్ కూడా ఇంతటి విజయాన్ని ఊహించలేదని చెప్పాలి. తొలి సారి కంటే రెండో సారి అనూహ్యమైన మెజారిటీ తో గెలిచింది టీ ఆర్ ఎస్ పార్టీ..