తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసింది.. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ ఇచ్చింది.. ముందు నుంచి ఇక్కడ గులాబీ పార్టీ దే విజయం అనుకున్నారు అంతా కానీ రఘు నందన్ రెడ్డి ని స్వల్ప మెజారితో గెలిచారు.. రాష్ట్రంలో రాజకీయ చాణక్యుడు గా కేసీఆర్ కి మంచి పేరుంది. అయన వ్యూహం రచిస్తే ఎంతటి ఎన్నికల్లో అయినా పార్టీ గెలవక తప్పదు.. అయితే తొలిసారి రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది.. దుబ్బాక లో ఓడిపోవడం కేసీఆర్ కి ఒకవిధంగా అవమానం లాంటిదే..