తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎదురులేకుండా పరిపాలన సాగిస్తున్నాడు.. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్కడ కూడా ఎదురులేదు.. సరైన ప్రతిపక్షం లేకపోవడం ఉన్నా అందులో నాయకులు చాలా డల్ గా ఉండడంతో రెండో సారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలలో మంచి పేరును సంపాదిస్తూ ముందుకు వెళ్తున్నాడు.. అయితే రెండో సారి పరిస్థితి లు మొదటిసారి ఉన్నట్లు లేవని చెప్పాలి.. కొంతమంది నాయకులు ఈ గ్యాప్ లో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు, కేసీఆర్ పై కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది..