దుబ్బాక లో గెలిచినా ఉత్సాహమో ఏమో కానీ బీజేపీ ఏం చెప్తే అదే జరిగిపోతుందని అనుకుంటుంది.. అంతేకాదు కేసీఆర్ వేసే పంచ్ లకు లొసుగులు, లాజిక్ లు కూడా వెతుకుతుంది.. ఇటీవలే కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో ని రిలీజ్ చేస్తూ ప్రసంగం ఇచ్చారు.. నిజానికి కేసీఆర్ ప్రసంగం ఇస్తుంటే ఎంతటివారైనా ముగ్దుడవక తప్పరు. అయన ప్రసంగం మధ్య లో వేసే ఛలోక్తులు, వాడైనా మాటలు చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంతే,,ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసే కొన్ని కామెంట్లు.. వాళ్లను మరీ తేలిక చేస్తూ వేసే కౌంటర్లు భలేగా ఉంటాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలామంది ఆయనకు, అయన ప్రసంగానికి అభిమానులు ఉంటారు.. ఐతే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన ప్రసంగంలో లాజిక్ ని బయటపెట్టి దీన్ని కూడా ఓ లాజిక్ అంటారా అనేట్లు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.