తెలంగాణ లో మాదిరిగానే ఏపీ లోనూ బలపడాలని చూస్తున్న బీజేపీ పార్టీ కి తిరుపతి ఉప ఎన్నిక వేదిక కానుంది. ఇక్కడ ఇప్పటికే పోటీ చేస్తామని ప్రకటించిన బీజేపీ గెలిచి టీడీపీ కి షాక్ ఇవ్వడమే కాదు వైసీపీ కి భయం పుట్టించాలని చూస్తుంది.. కేంద్రంలో కూడా ఏపీ లో బీజేపీ పుంజుకుంటుందని నమ్మకం కల్గించాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.. ఇప్పటికే సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ చాలా పుంజుకుందని చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంలో ఒక్క సీటు కూడా లేకపోయినా సోము వీర్రాజు కేంద్రం అండగా చూసుకుని రెచ్చిపోతున్నారు..