తెలంగాణ కాంగ్రెస్ ఇక అంతిమ దశకు వచ్చినట్లే కనిపిస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత బలపడుతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా చాలా వీక్ అయిపొయింది.. కనీస పోటీ ని కూడా తెరాస పార్టీ కి ఇవ్వలేకపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ యొక్క భేళాతనం బయటపడింది.. కేసీఆర్ తెరాస పార్టీ రికార్డు స్థాయిలో గెలవడంతో కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదని తెలిసింది.. అయితే అక్కడి తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ పుంజుకోవడానికి కాంగ్రెస్ ఎప్పుడు ప్రయత్నించలేదు..