సామాన్య పార్టీ గా తెలంగాణ లో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు అసామాన్య పార్టీ గా మారిపోయింది.. ప్రధాన ప్రతిపక్ష హోదా ను కొట్టేసి ఇప్పుడు అధికార ప్రభుత్వాన్ని కూలదోసి తాను అధికారంలోకి రావడాలని చూస్తుంది.. అందుకు కేసీఆర్ మీద వ్యతిరేకత కూడా అనుకూలిస్తుంది.. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు తెలంగాణ ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు.. దాంతో కేసీఆర్ కి ప్రజలు దుబ్బాక రూపంలో చిన్న ఝలక్ ఇచ్చారు.. అయితే ఆ ఝలక్ కూడా కేసీఆర్ కి సరిపోదని గ్రేటర్ లో పార్టీ ని ఓడించినంత పని చేశారు..