ఎన్నికల్లో ఓటమి దగ్గరినుంచి జనసేన శ్రేణులకు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించే అంశం లేదు.. పార్టీ ని బీజేపీ లో విలీనం చేసి తప్పు చేశామా అన్న సందర్భాలు వారికి చాలానే కలిగాయి. దానికి తగ్గట్లు వారి పట్ల బీజేపీ వైఖరి కూడా చాలా కఠినంగా ఉండడంతో వారి పొత్తు ఏ క్షణాన్నైనా వీగిపోవచ్చనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ పవన్ కళ్యాణ్ ఓర్పుతో ఇన్నాళ్లు వేచి చూశారు.. ప్రచార సభాల్లో బీజేపీ జనసేన పేరు కూడా ఎత్తేది కాదు, తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకుంది బీజేపీ పార్టీ నే.