తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడు ఒకటే ఆసక్తి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఎవరు ఇక్కడ చీఫ్.. ఇటీవలే తెలంగాణ లో నిర్వహించిన దుబ్బాక ఉప ఎన్నిక , గ్రేటర్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఒక్కసారిగా కలకలం మొదలైంది.. అందరిలో నిరాశ కూరుకుపోయింది.. తద్వారా వారి ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ తెలంగాణ టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు..ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై ఉన్న పరువు తీసేసుకుంది..