తెలంగాణ లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పొచ్చు.. బీజేపీ కూడా తెరాస కు ఏమాత్రం తీసిపోదని ఇటీవలే జరిగిన ఎన్నికల ద్వారా తేలిపోయింది. ఇన్నాళ్లు టీ ఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యంతో ఏ పార్టీ కూడా ప్రజలోకి వెళ్లలేకపోయింది.. ప్రజలకు గులాబీ పార్టీ మీద ఉన్న నమ్మకమో, లేదా కేసీఆర్ పై ఉన్న నమ్మకమో తెలీదు కానీ ప్రజలు కేసీఆర్ ని తప్పా ఎవరిని నమ్మలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని సైతం పక్కన పెట్టి కేసీఆర్ వైపు మొగ్గారు ప్రజలు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది..