తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి.. వాటి ఫలితాలు, ఏ పార్టీ గెలిచింది అన్నది పక్కన పెడితే ఈ ఎన్నికల వల్ల ప్రజలకు ఎఫెక్ట్ బాగానే పడింది అని చెప్పొచ్చు.. గత పదిమాసాలుగా దేశంలో కరోనా ఎంతటి నిర్ణయాత్మకమైన మార్పులు తెచ్చిందో మనం చూశాం. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్, మాస్క్ అనే కొత్త కొత్త పద్ధతుల్లో జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ని మనం చూస్తున్నాం.. ఇలాంటి సందర్భంలో దేశంలో తప్పక జరగాల్సిన కార్యక్రమాలు ఎంతో జాగ్రత్తగా జరిపించుకునే బాధ్యత మనపై ఉంది..