దేశం మొత్తం ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తుంది.. జమిలీ ఎన్నికలు.. సాధారణ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండుళ్లు కూడా జరగలేదు అప్పుడే జమిలీ ఎన్నికలు ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా మోడీ మాత్రం ఈ జమిలీ ఎన్నికల మంత్రాన్నే జపిస్తున్నారు. ప్రస్తుతం రైతుల నిరసన తో బీజేపీపార్టీ కి దేశంలో కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. ఈ సమయంలోకూడా మోడీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతుండడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. గత కొన్ని రోజులనుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయో అని అంతా సిద్ధం చేసుకుంటున్నారు..