తిరుపతి ఉప ఎన్నిక కొన్ని రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ, వైసీపీ పార్టీ లు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక్కడ వైసీపీ పార్టీ కి ఎక్కువ అవకాశాలున్న వేళా బీజేపీ పార్టీ తమకేం ఇక్కడ బలం తక్కువ లేదని చెప్తూ అధికార పార్టీ ని కలవరపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ పార్టీ లు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుని పోటీ కి సిద్ధంగా ఉంది.. బీజేపీ నుంచి మాత్రం ఎవరు పోటీ చేస్తారు అన్నది ఇంకా తెలియలేదు. అసలు బీజేపీ చేస్తుందా, జనసేన చేస్తుందా అన్న సందేహం కూడా వారిలో తీరలేదు..