తెలంగాణ లో మరోసారి ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది.. నాగార్జున సాగర్ లో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది..ఇంకా పట్టభద్రుల ఎమ్మెల్సీ త్వరలో జరగనుంది. దీంతో ఎన్నికల హడావుడి మరోసారి మొదలవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే కేసీఆర్ పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత లో ఉన్నారు. అందుకు తగ్గట్లే రాష్ట్రంలో ఎదురులేని టీ ఆర్ ఎస్ పార్టీ ని ఖంగు తినిపించారు.. వరుసగా దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో తేడా ను చూపించి తెరాస పార్టీ కి షాక్ ని ఇచ్చారు..