ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కొన్ని సార్లు రాజకీయాలు ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే నాయకులూ వేసే ఎత్తులకు కాలమే పై ఎత్తులు వేసి వారికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది.. ఆ పార్టీ అధికారంలో ఉండాలి కదా అని అందులోకి వెళితే కాలం నిర్ణయం మరోలా ఉంటుంది.. చేతులు కాలాయని తెలుసుకునే లోపు ఆకులు దొరకవు.. ఇప్పుడు రాష్ట్రంలో ని కొంతమంది నేతల పరిస్థితి అలానే ఉంది.. ఇదిలా ఉంటే జగన్ అధికారంలోకి వచ్చి సంవత్సరంనర దాటిపోయింది.. ప్రజలు జగన్ అధికారాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు.. సక్రమంగా సంక్షేమ పథకాలు పొందుతూ గతంలో ఎప్పుడు లేనంతగా సంతోషంగా ఉంటున్నారు. అయితే టీడీపీ వారికి మాత్రం జగన్ సీఎం అవడం ఏమాత్రం మింగుడు పడడం లేదు..