అధికారంలోకి రాకముందు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించి ప్రజలకు ఎంత చేరువ అయ్యాడో అందరికి తెలిసిందే. ఆ పాదయాత్ర మూలంగానే జగన్ కి మంచి మైలేజ్ వచ్చింది.. ప్రజల్లో మంచి పేరు వచ్చింది.. ఆ ఫలితంగానే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఏ పార్టీ గెలవనటువంటి మెజారిటీ తో గెలిచింది వైసీపీ పార్టీ..సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఏం అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు.. ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు..