2018 ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కిన సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ ని నమ్మి ఆయనను ముఖ్యమంత్రి గా చేశారు. ఏకంగా 151 సీట్లతో ఆయన అధికారంలోకి రాగా టీడీపీ కి కేవలం 23 సీట్లు దక్కాయి. జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఎంత దీనంగా తయారైంది అందరికి తెలిసిందే.. కరోనా కారణంగా అయన బయటకి రాకుండా పార్టీ ని గాలికి వదిలేశారు.. దాంతో టీడీపీ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.