ఇటీవలే జరిగిన గ్రేటర్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ గెలవకపోయినా మంచి ప్రభావం మాత్రం చూపించింది. అధికార టీ ఆర్ ఎస్ పార్టీ పై ప్రజలకు ఉన్న వ్యతిరేకత ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ పార్టీ సఫలమైనది. నిజానికి గ్రేటర్ లో తామే గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. అదే నిజం కూడా. టీ ఆర్ ఎస్ కు గతం లో కన్నా సీట్లు తక్కువ రావడంలో బీజేపీ పార్టీ పనితనం స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచినా సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.