తెలంగాణ లో వరుస ఎన్నికలు అందరిని ఆసక్తిగా ఉండేలా చేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి లేదో అప్పుడే ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి, సాగర్ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది.. తెలంగాణ లో అసలు సిసలు రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పొచ్చు..ఇన్నాళ్లు టీ ఆర్ ఎస్ పార్టీ ఆధిపత్యంతో ఏ పార్టీ కూడా ప్రజలోకి వెళ్లలేకపోయింది.. ప్రజలకు గులాబీ పార్టీ మీద ఉన్న నమ్మకమో, లేదా కేసీఆర్ పై ఉన్న నమ్మకమో తెలీదు కానీ ప్రజలు కేసీఆర్ ని తప్పా ఎవరిని నమ్మలేదు.