తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి చాలామంది యువ రాజకీయ నాయకులకు అయన మార్గదర్శి అని చెప్తుంటారు. ప్రతిపక్ష నేతలు కూడా ఆయనను రోజుకోసారైనా స్మరించుకుంటారు.. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవ అలాంటిది ఇలాంటిది కాదు.. సొంత నియోజకవర్గం కన్నా ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి తెలంగాణా ను అభిమానించే వారు..