పవన్ కళ్యాణ్ రాజకీయాలను, సినిమాలను రెండు చేస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి దగ్గరినుంచి జనసేన శ్రేణులకు ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలించే అంశం లేదు.. ఒక్క సీటుతో జనాల్లో ఉన్న పాపులారిటీ ని తగ్గించుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కానీ స్థితిలో ఉన్నారు. అప్పుడే బీజేపీ అభయహస్తం ఉండడంతో పార్టీ ని బీజేపీ తో పొత్తుకు ముందుకు కదిలారు. అయితే తాము తప్పు చేశామని తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు..