దేశంలో ఆధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఒక్కో రాష్ట్రం లో బలపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. వచ్చే ఎన్నికల నాటికి మాక్సిమం రాష్ట్రాలు తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తుంది.. ఉత్తరాదిలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. ఇకముందు కూడా అక్కడ బీజేపీ తన ప్రాధాన్యం కోల్పోదు.. అందుకు అక్కడి సేవా కార్యక్రమాలే నిదర్శనం.. మరో పదేళ్లు ఉత్తరాదిన బీజేపీ ని కొట్టే పార్టీ అయితే లేదు అని చెప్పాలి. ఈ నేపథ్యం లో వారు సౌత్ పై నిఘా వేశారు.