పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ఎం జరుగుతుందో సరిగ్గా తెలీట్లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే యువతిని ఓ కుర్రాడు చంపేశాడు. కేసుకు సంబంధించి యువకుడిని పట్టుకున్న పోలీసులు అనేక కేసులు నమోదుచేశారు. ఈ విషయమై పవన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘దిశాచట్టం’ వల్ల ఉపయోగం ఏమిటంటూ ప్రశ్నించేశారు. దిశాచట్టాన్ని ప్రభుత్వం కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుంటోందంటు మండిపడ్డారు. చట్టం చేయటం కాదని దాన్ని సక్రమంగా ఉపయోగించాలని సలహా కూడా పడేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం దిశచట్టం చేయటం వరకు కరక్టే. కానీ దాన్ని కేంద్రప్రభుత్వం ఆమోదించలేదు. దిశాచట్టంలో సవరణలను ప్రతిపాదించి మళ్ళీ బిల్లును రాష్ట్రానికే పంపింది.