ఇటీవలే ఎదురవుతున్న కాంగ్రెస్ ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ తెలంగాణ టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు.. గ్రేటర్ ఫలితం తో కాంగ్రెస్ ఈ పరిణామం చోటు చేసుకోగా ఇప్పుడు కొత్త టీపీసీసీ ఎంపిక జరుగుతుంది.. గత కొన్ని రోజులనుంచి తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. దుబ్బాక లో , గ్రేటర్ లోనూ అదే సీన్ రిపీట్ కావడంతో కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఓటములను సీరియస్ గా తీసుకుంది.