తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఇప్పుడు దారుణమైన స్థితికి చేరుకుంది. తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ అయినా ఆ పార్టీ ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు.గ్రేటర్ ఫలితం తో కాంగ్రెస్ పార్టీ లో కలకలం మొదలైంది.. దాంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది దుబ్బాక లో అయినా కాంగ్రెస్ గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ మూడో స్థానానికి పరిమితమై పరువు తీసేసుకుంది.. వరుసగా రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతోనే పార్టీ క్యాడర్ ఢీలా పడిపోయింది..