ఏపీలో బీజేపీ కార్యకర్తలు ఉండవల్లి ని టార్గెట్ చేసుకుని ఆయనపై విమర్శలు చేస్తున్నారు.. ఉండవల్లి ఇటీవలే కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు బీజేపీ పై చేయడం ఇందుకు కారణం.. కాంగ్రెస్ నేతగా, మాజీ లోక్ సభ సభ్యుడిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలను నుంచి తప్పుకున్న ప్రభుత్వాలపై వాళ్ళ పనితీరును విమర్శిస్తుంటారు.. మంచి ఉంటే పొగుడుతారు కూడా..ఈ నేపథ్యంలో పోలవరం పై అయన ఇటీవలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం పై ఎన్నో ప్రెస్ మీట్ లు నిర్వహించిన ఉండవల్లి ఇటీవలే బీజేపీ కార్యకర్తలకు ఆగ్రహం కలిగించేలా మాట్లాడరు.