తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ తెలంగాణ టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు.. దాంతో టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్లు రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకరకంగా ఆ పోస్ట్ రేవంత్ రెడ్డి కే ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియా లో వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ లోని సీనియర్ లు గతంలో లాగానే అసంతృప్తి ని వెళ్లబుచ్చుతున్నారు.. హనుమంత్ రావు, జగ్గారెడ్డి వంటి నేతలు బహిరంగంగానే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.