ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతను ఆలోచనలో పడేసేలా చేశాయి. ముఖ్యంగా బీజేపీ, ఒవైసీ, ఎంఐఎం పార్టీ ల్లో చేరే వారికి అయన మాటలు ఎంతగానో ఆలోచనలో పడేసేలా చేశాయి.. ఏపీలో ఆయా పార్టీ ల కార్యకర్తలు ఉండవల్లి ని టార్గెట్ చేసుకుని ఆయనపై విమర్శలు చేస్తున్నారు.. ఇటీవలే కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు బీజేపీ తో సహా పలు పార్టీ ల పై చేయడం ఇందుకు కారణం.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురు గోల్వాల్కర్ రాసిన పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాతే.. తాను ఆర్ఎస్ఎస్ ను వీడానని ఆయన చెప్పారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు దేశానికి మంచివి కావని కూడా చెప్పారు. బీజేపీలో చేరాలనుకుంటున్న వారు.. ముందు ఆ పుస్తకం చదివిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.