జగన్ రాష్ట్రంలో మొత్త రెండు ప్రతిపక్షాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.. అది ఒకటి టీడీపీ అయితే రెండో బీజేపీ.. తెలంగాణ లో బీజేపీ ప్రభంజనం అందరు గమనిస్తూనే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో మొదలైన వారి ప్రభంజనం నిన్నటి గ్రేటర్ ఎన్నికల వరకు కొనసాగుతూ వచ్చింది. క్రమక్రమంగా వారి బలం రాష్ట్రంలో పుంజుకుంటూ వచ్చి గెలిచేంతవరకు వచ్చింది..ఇప్పుడు బీజేపీ గురి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై పడింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే తిరుపతి ఉప ఎన్నిక వేదికగా బీజేపీ తన సత్తా చాటాలని చూస్తుంది.