సోము వీర్రాజు కొత్తరకంగా పార్టీ ని బలోపేతం చేయడానికి ట్రై చేస్తున్నాడు. బీజేపీ చూపు ఇపుడు రాయలసీమ మీద ఉంది. ఇక్కడ టీడీపీ ఏనాడో చేతులెత్తెసింది. పైగా వైసీపీ తప్ప మరో పార్టీ కూడా ఇక్కడ గట్టిగా లేకుండా ఉంది. దాంతో ఆ లోటుని భర్తీ చేస్తూ తామే సరైన ఆల్టర్నేషన్ అని బీజేపీ నిరూపించుకుంటే మొత్తం 51 సీట్లు కలిగిన సీమ నుంచే రాష్ట్ర అధికారం వైపుగా అడుగులు వేయాలని బీజేపీ చూస్తోంది. దానికి నాందిగా హై కోర్టు అంశాన్ని వాడుకోవాలనుకుంటోంది. బీజేపీ తలచుకుంటే హై కోర్టు కర్నూల్ కి తప్పక వస్తుంది. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి కూడా తగిన వాతావరణం రూపొందుతుంది.