ఇన్నాళ్లు తెలంగాణాలో టిఆర్ఎస్ పార్టీ కి ఎదురు లేదన్నది వాస్తవం..తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టి.ఆర్.ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా వ్యక్తిరేకత గత కొద్దీ కాలంగా ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే అధికార పార్టీ మాత్రం దీన్ని కొట్టేస్తుంది.. తెలంగాణాలో గులాబీ పార్టీ ప్రజలకు ఎప్పుడు విధేయతగా ఉంటుంది అందుకే ప్రజలు పార్టీ ను గెలిపిస్తూ వస్తున్నారు అని చెప్తున్నారు.. దుబ్బాక లో ఓటమి తర్వాత వారి వాయిస్ గతంలోకన్నా తగ్గింది అని చెప్పొచ్చు.. అంతేకాదు గ్రేటర్ లో నూ ఆశించిన ఫలితాలు లేకపోవడంతో కేసీఆర్ సైన్యం వాయిస్ మూగబోయింది