గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. కాంగ్రెస్ లాంటి మేటి పార్టీ ని వెనక్కి తిరిగి చుకోకుండా చేసింది.. అంతేకాదు అధికార పార్టీ కి కూడా చెమటలు పట్టించింది బీజేపీ.. ఈ నేపథ్యంలో తెలంగాణ లో మరో ఉప ఎన్నిక అందరిలో ఆసక్తి ని రేపుతోంది... నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.. తెలంగాణా లో టీ ఆర్ ఎస్ పార్టీ ఒకింత బలహీనమై పోయింది అని చెప్పాలి.. ఇటీవలే జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ పార్టీ ఓ మోస్తరు విజయం సాధించగా గతంలోలా ప్రభంజనాన్ని మాత్రం చూపించలేకపోయింది.