ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల జోరు మొదలుకానుంది. ఇక్కడ తిరుపతి లో అతి త్వరలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీ లు అక్కడ పాగా వేయాలని చూస్తుండగా టీడీపీ మాత్రం ఇప్పటికే ఎన్నికల శంఖం పూరించింది. అక్కడ అభ్యర్థి ని బరిలోకి దించి రేస్ లో తామే ముందున్నట్లు చెప్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పై ఓటమి చెందిన పనబాక లక్ష్మి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తుంది.. అయితే ఇక్కడ టీడీపీ కి గెలుపు అనుకున్నంత ఈజీ కాదు..