దేశంలో చెలరేగిన రైతుల ఆగ్రహ జ్వాలలు ఇప్పటికీ తగ్గలేదు.. ఇది మోడీ ప్రభుత్వానికి ఎంతో చెడ్డ పేరును తీసుకొస్తుండగా ఢిల్లీ లో ఇప్పటికే వందల కొలది రైతులు వచ్చి ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో పాటు ఇటీవలే భారత్ బంద్ ను సైతం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ బంద్ కి దేశంలోని చాల పార్టీ లు సముఖత తెలియపరచగా కేసీఆర్ కూడా పూర్తి సంఘీభావం చేస్తున్నట్లు ప్రకటించాడు. కేంద్రం పై కేసీఆర్ ఓ విధంగా యుద్ధాన్ని ప్రకటించారని అయన చేస్తున్న కొన్ని చర్యల ద్వారా చెప్పొచ్చు.