తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోడీ పై మండిపడుతున్న వేళ బీజేపీ బలపడడం మోడీకి, బీజేపీ పార్టీ కి కలిసొచ్చే అంశం.. ఓవైపు రాష్ట్రంలో బలం తగ్గుతుంటే కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ వైపు వెళ్లడం చూస్తే ఒకరకంగా బీజేపీ కి కేసీఆర్ పెద్ద తలనొప్పి లా తయారవుతాడని అందరు అనుకున్నారు. కానీ ఇటీవలే ఢిల్లీ టూర్ మొత్తం విషయాన్నీ మార్చేసింది. ఢిల్లీ లో రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేపడుతున్న విషయం తెలిసిందే.. కొన్ని రోజులుగా రైతులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారు.