మెగా ప్రిన్సెస్ కొణిదెల నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్య తో ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. ఈ పెళ్లి కి మెగా హీరోలందరూ రాగా నిహారిక ను అందరు విష్ చేశారు. ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ వివాహం ఇంత ఘనంగా జరగలేదని చెప్పాలి.. చిరంజీవి వారసుల పెళ్లి కూడా ఇంత ఘనంగా జరగలేదు.. పెళ్ళికి ముందునుంచి నిహారిక తన సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి విషయమై మంచి హైప్ తీసుకొచ్చింది. అంతేకాదు తన సోషల్ మీడియా లో ఒక్కో ఫోటో ని పెడుతూ తమ పెళ్లిని తానే హైలైట్ చేసుకుంది.