కేసీఆర్ కి తెలంగాణ పై పట్టు తప్పుతున్న వేళా అయన ఒక్కోమెట్టు కిందికి దిగుతూ ప్రజలకు వరాలు కురిపిస్తున్నారు.. ఇప్పటికే పలు ఎన్నికల్లో కేసీఆర్ కి తాము ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలియజెప్పారు ప్రజలు.. ఒకవేళ ఇలాగే పరిపాలన కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో మరింత ప్రభావితం చూపుతామని ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేసారు ప్రజలు.. దీంతో వచ్చే సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ప్రజలకు కొన్ని వరాలు ప్రకటించారు. ఇప్పటికే ఉద్యోగాలను ఎరగా వేశారు. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు..