తెలంగాణ లో ఉప ఎన్నికల జోరు కొనసాగుతుంది. వరుస ఎన్నికలతో రాష్ట్రమంతా వేడి రాజేసుకుంటుంటే ఆ ఫలితాలతో రాజకీయనాయకుల్లో వణుకు పుట్టిస్తుంది. ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల పర్వం ముగియగా మరో ఉప ఎన్నికకు రాష్ట్రంలో రంగం సిద్ధమవుతుంది.. నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.. ఇక్కడ గెలుపుకోసం అన్ని పార్టీ లు కసరత్తులు ప్రారంభించగా బీజేపీ పార్టీ ఇక్కడ గెలిచి మరోసారి తమ పవర్ ఏంటో చూపించాలని చూస్తుంది.