2018 ఎన్నికల్లో ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కిన సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ ని నమ్మి ఆయనను ముఖ్యమంత్రి గా చేశారు. ఏకంగా 151 సీట్లతో ఆయన అధికారంలోకి రాగా టీడీపీ కి కేవలం 23 సీట్లు దక్కాయి. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన ఓ పార్టీ అదీ టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇదే తొలిసారి.. ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత లేకపోతే మాత్రం ఈ రేంజ్ లో ప్రజలు ఓడించారు.. తమ విజయం ఖచ్చిత అనుకున్న ప్రతి చోటా వైసీపీ నెగ్గి టీడీపీ ని ఖంగు తినిపించేంలా చేసింది.