ఎన్నికల కోడ్ తొలగించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించి ముందుకెళ్లాలని ఆదేశాలు కూడా అందుకున్నారు. అయినా ఇప్పుడు ఆయన కోర్టు ధిక్కారణకు పూనుకున్నట్టు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.. ప్రతిపక్షాల అండతో స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తున్నారు. కరోనా ఇంకా తగ్గలేదని ఎంత మొత్తుకుంటున్నా నిమ్మగడ్డ తన స్వలాభం కోసం వైసీపీ పార్టీ ని ఓడించాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అపాయింటి చేసిన నిమ్మగడ్డ టీడీపీ గెలవడానికి టీడీపీ నేతలకన్నా ఎక్కువగా కష్టపడుతున్నారు.