పార్టీ పెట్టిన దగ్గరినుంచి జనసేన రాష్ట్రంలో ఎప్పుడు ప్రభావం చూపలేకపోయింది.. 2014 లో పార్టీ పెట్టినా అప్పుడు పోటీ చేయలేదు.. 2019 లో పోటీ చేస్తే ఒక్క సీటు తో సరిపెట్టుకుని దారుణంగా విమర్శల పాలయ్యింది. దాంతో జనసేన పార్టీ ఇక ప్యాక్ అప్ చెప్పుకోవడం బెస్ట్ చాలా విమర్శలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ మొక్కవోని దీక్ష తో పార్టీ ని ముందుకు నడిపించాలని డిసైడ్ అయ్యారు. బీజేపీ తో పొత్తు పెట్టుకుని ప్రభుత్వానికి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవలే అయన ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు..