గ్రేటర్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ గెలవకపోయినా మంచి ప్రభావం మాత్రం చూపించింది. అధికార టీ ఆర్ ఎస్ పార్టీ పై ప్రజలకు ఉన్న వ్యతిరేకత ను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ పార్టీ సఫలమైనది. నిజానికి గ్రేటర్ లో తామే గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. అదే నిజం కూడా.ఈ నేపథ్యంలో సాగర్ లో ఎలాగైనా గెలవాలని టీ ఆర్ ఎస్ భావిస్తుంది.. ఇప్పటికే కేసీఆర్ కి తెలంగాణ లో ఎదురవుతున్న పరాభవాలు టీ ఆర్ ఎస్ పార్టీ తట్టుకోలేకపోతుంది.